యాదగిరిగుట్ట మండలం బహుపేట ఆదివారం, కాచారం కైలాస పురంలో ఆగస్టు 9 శుక్రవారం జరిగే శ్రీశ్రీశ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య, యాదాద్రి జిల్లా డిసిపి రాజేష్ చంద్రలకు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆహ్వాన పత్రిక అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వారి కళ్యాణం తో పాటు, అమ్మవారికి బోనాలు కూడా సమర్పించడం జరుగుతుందని తెలిపారు. అమ్మవారి, స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎడ్ల రామ్ రెడ్డి తదితరులు ఉన్నారు.