– రాష్ట్ర వికలాంగులకు కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
పెరిక కులస్తులు అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఇప్పటివరకు ఏ పార్టీ పెరిక కుల కార్పొరేషన్ విషయంలో పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెరిక కుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించడం హర్షనీయమని పెరిక కుల కార్పొరేషన్ సాధకులు, తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని పెరిక కుల జిల్లా కార్యాలయ భవనంలో నల్లగొండ జిల్లా పెరిక కుల సంఘం అధ్యక్షులు ముత్తినేని శ్యాం సుందర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సన్మాన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. పెరిక కుల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో పెరిక కులానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో తనకు చైర్మన్ అయ్యే అవకాశం వచ్చింది అన్నారు. ఆర్థికంగా ఎదగడంతోపాటు పలువురికి సహకారం అందించాలని కోరారు పెరికకుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్తినేని శ్యాంసుందర్ మాట్లాడుతూ పెరికకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెరిక కుల సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. అవకాశం ఉన్నచోట పెరిక కులస్తులందరూ ఎన్నికల బరిలో నిలవాలని సూచించారు. అనంతరం రాష్ట్ర వికలాంగుల కోపరేటివ్ చైర్మన్ ముత్తినేని వీరయ్యను నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ లను పూలమాలలు, శాలువాలు, మెమెంటోళ్ళతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెరిక కుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వలిశెట్టి సత్యనారాయణ,జిల్లా గౌరవ అధ్యక్షులు కోట మల్లికార్జున రావు, రాష్ట్ర పేరిక హాస్టల్ సంక్షేమ సంఘం అధ్యక్షులు అంగిరేకుల నాగార్జున, సంఘం నాయకులు దాసరి మల్లేశం, వీర రాఘవులు, నెమ్మని కాంతారావు, సముద్రాల నారాయణ, గోవర్దన్, వెంకటరమణ, సత్యం, నాగభూషణం, పాండు, సుజాత, స్వప్న, స్వరూప తదితరులు పాల్గొన్నారు.