నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1993-1994 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జయ గార్డెన్ ధర్మోజి గూడెం పదవ తరగతి చదివినటువంటి విద్యార్థిని విద్యార్థులు 30 సంవత్సరాలు సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 30 సంవత్సరాల క్రితం చదువు నేర్పిన గురువులు పాండురంగ విట్టల్,అంజయ్య,ప్రసాద్ రావు,రంగారావు, ధనంజయ,ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ మేము చదువు చెప్పినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఈరోజు ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ మాపై ఇంత ప్రేమతో గౌరవం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు దేశానికి రా్ట్రానికి గ్రామానికి మన తల్లిదండ్రుల పేరును నిలబెట్టే విధంగా మీరు మీ పిల్లలను ఆ విధంగా పెంచి దేశానికి గుర్తింపు తెచ్చే విధంగా తయారు చేయాలని ఉపాధ్యాయులు ఉపదేశించారు.ఈ కార్యక్రమంలో దండ అరుణ్ కుమార్, బోనకుర్తి కిషోర్,బడుగు జయప్రకాష్,గోషిక కరుణాకర్,ఉడుగు మల్లేష్ గౌడ్,బాలకృష్ణ, బొబ్బిళ్ళ కాలేశ్వర్,ఉడుగు సత్యం డాకోజి కవిత గంజి సుమతి వేముల యమున అనురాధ పోలోజి జ్యోతి పాలకూరల గీత పోలోజు శ్రీనివాస చారి గంజి శ్రీహరి వెంకటేష్ వర్కాల వెంకటేష్ మల్లేశా తదితరులు పాల్గొన్నారు.