
భువనగిరి పట్టణంలోని ఆర్ కే ఆసుపత్రి ఆధ్వర్యంలో పట్టన శివారులో ఉన్న స్వర్ణగిరి ఆలయంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం డాక్టరు రాజకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని రాష్ట్ర ఆర్టీసీ ఎండి సజ్జనార్, రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, భువనగిరి ఆర్డీవో అమరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా 200 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఆలయ చైర్మన్ మురళీకృష్ణ, గోపికృష్ణ లు పాల్గొన్నారు.