పనుల పురోగతిని పరిశీలించిన చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి

Chairman Burri Shanivas Reddy inspected the progress of the works– పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచన
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజి ఇతర అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాస్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశానుసారం కౌన్సిలర్వు గోల రాములమ్మ గణేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని 19వ వార్డు శ్రీనగర్ కాలనీ ఎన్జీవోస్ కాలనీ, నందీశ్వర కాలనీ, ప్రాంతాలలో అభివృద్ధి పనులను పరిష్కరించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.వచ్చే 8 నెలల కాల వ్యవది లో అండర్ గ్రౌండ్ పనుల అనంతరం సి సి రో్స్ వేయడం జరుగుతుందని, ప్రజల సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా డ్రైనేజి నిర్మాణ పనులు పూర్తయిన కాలనీవాసులు చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సన్మానించారు. అనంతరం గణేష్  మాట్లాడుతూ.. నల్గొండ పట్టణం లో మొదటి ప్రాధాన్యత ఇచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి 19వ వార్డు ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలిపారు. ఎల్లవేళలా  సహాయ సహకారాల ను అందిస్తున్న  చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి కి ఆలాగే పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ  కార్యక్రమం లో కాలనీ వాసులు కోమటిరెడ్డి సమీ రెడ్డి, యడవల్లి అంజయ్య, వెంకట్ రెడ్డి,శ్రీనివాస్,సంపత్ నాయుడు, పబ్లిక్ హెల్త్ ఏఈ నాగ ప్రసాద్, ఇంజనీర్ చక్రవర్తి, మున్సిపల్ జవాన్ శివ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రంజిత్ నాయుడు, యువకులు శివాజీ, అశ్విన్ నాయుడు, శివ నాయుడు తదితరులు పాల్గొన్నారు.