అంబేద్కర్ విగ్రహానికి కళాకారుల వినతి..

Artist's request for Ambedkar statueనవతెలంగాణ – వేములవాడ 
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ముఖ్య భూమికను పోషించిన వేములవాడ నియోజకవర్గ కళాకారుల జేఏసీ కమిటీ కళాకారులు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు  సోమవారం వేములవాడ పట్టణంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్  విగ్రహానికి ఉద్యమ కళాకారుల వినతి పత్రము అందజేశారు. కళాకారుల జేఏసీ కమిటీ చైర్మన్ యెల్ల పోశెట్టి  మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగస్వామ్యమై పోరాడిన తెలంగాణ ఉద్యమకారులకు  ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో స్పష్టమైన ప్రకటన చేస్తూ మేనిఫెస్టోలో పొందుపరచిన ఉద్యమకారునికి 250 గజాల స్థలము, గౌరవ పెన్షన్ నెలకు 25 వేల రూపాయలు ఇతర హామీలను నెరవేర్చాలని  అన్నారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య గౌరవాధ్యక్షులు బొడ్డు రాములు, జిల్లా అధ్యక్షులు సావనపల్లి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి వారాల దేవయ్య, సేవాసంస్థ అధ్యక్షులు మానువాడ లక్ష్మీనారాయణ, ప్రధానకార్యదర్శి వెంపటి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.