
టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని స్టేట్ కన్వీనర్ ఖాజా అహ్మద్ అన్నారు.సోమవారం వివిధ జిల్లాల బార్ అసోసియేషన్ సభ్యులతో ఆయన శంషాబాద్ లోని తన నివాసంలో సమావేశమయ్యారు .ఈ సందర్బంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు క్షేత్ర స్థాయి లో చేపట్టాల్సిన కార్యాచరణ పై న్యాయవాదులతో సమాలోచనలు జరిపినట్లు తెలిపారు.న్యాయ వాదులు ప్రధానంగా ఎదుర్కొంటున్న జూనియర్ అడ్వొకేట్ స్టయిఫండ్ పెంపు ,న్యాయవాదుల భీమా పరిమితి పెంపు,అడ్వకేట్ హోసింగ్ సొసైటీ బలోపేతం ద్వారా ఇళ్ల స్థలాల కేటాయింపు వంటి పలు సమస్యల పరిష్కారం పై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ,లీగల్ సెల్ చైర్మన్ అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలవనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్, మోమిన్ రోషన్ జమీర్, మొహమ్మద్ రహ్మత్ అలీ, బాసిత్ ఖాన్, మెహమూద్ ఉర్ రెహమాన్, అర్హాన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ లో చేరిన న్యాయవాది నిస్సార్ అహ్మద్
టీపీసీసీ లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్ ఖాజా అహ్మద్ ఆధ్వర్యంలో సోమవారం న్యాయవాది నిస్సార్ అహ్మద్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు.ఈ సందర్బంగా ఖాజా అహ్మద్ ఆయనకు ఖండువా కప్పిపార్టీ లోకి ఆహ్వానించారు.తన నియమాకానికి సహకరించిన టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ అశోక్ గౌడ్, లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్ ఖాజా అహ్మద్ , కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ,కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.