
హైదరాబాద్ లోని తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన బోనాల పండుగ ఉత్సవాల్లో టిజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి ముధోల్ నియోజకవర్గం తెలంగాణ జనసమితి ఇంచార్జి సర్దార్ వినోద్ కూమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముధోల్ విలేకరులతో పోన్ లో మాట్లాడారు. తెలంగణ ప్రాంతంలో బోనాల పండుగ కు ప్రాముఖ్యత ఉందన్నారు. అమ్మవారి దయతో పాడి, పంటలు బాగుండాలని అన్నారు. ముధోల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రొఫెసర్ కోదండరాం మద్దతు తో పాటు, కాంగ్రెస్ పార్టీ సహకారంతో కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు .