లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు సేవలు మరువలేనివని లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవా అధ్యక్షులు సుబ్బారావు సెక్రటరీ పోశెట్టి అన్నారు. వారు సూచించిన సేవా మార్గంలో లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవా సమితి పనిచేస్తుందని వారు తెలిపారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు 68వ పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగ పిల్లలకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సుబ్బారావు సెక్రెటరీ పోశెట్టి మాట్లాడుతూ ఘట్టమనేని బాబురావు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ 320 డి డైరెక్టర్ గా పనిచేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. వారి అడుగుజాడల్లో వారు సూచించిన సేవా మార్గంలో తాము కూడా నడవడం జరుగుతుందని చెప్పారు. ఘట్టమనేని బాబురావు 68వ పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగ విద్యార్థులకు ఈరోజు అన్న ప్రసాద కార్యక్రమం చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజినల్ సెక్రెటరీ శ్రీనివాసరావు, జోనల్ చైర్మన్ నవిత, సభ్యులు రాజ్యలక్ష్మి, రమాదేవి వెంకటలక్ష్మి, సవిత, మంజూష, తదితరులు పాల్గొన్నారు.