మండలంలోని బేగంపూర్ మరియు కాస్లబాద్ గ్రామాలను ఎంపీఓ సందర్శించారువర్ష కాలం దృష్ట్యా పంచాయతి పరిధిలో ఉన్న మురికి కాలువలు చెత్త చెదరాలను తొలంగిచాలని పంచాయతీ కార్యదర్శి ఇంధల్ సింగ్ ఆదేశించారు. శానిటేషన్ పనులను పరిశీలించారుబేగంపూర్ తండా పాటశాలను తనిఖీ చేసి నాణ్యమైన బోజనంతో పాటు విద్యను అందించాలని ఉపాద్యాయురాలు జ్యోతిను సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. అనంతరంకస్లాబాద్ లో మొక్కలు నాటి నీళ్లు పోశారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓలక్ష్మి కాంత్ రెడ్డి,కార్యదర్శిలు ఇంధల్ సింగ్,జ్యోతి పాల్గొన్నారు.