ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గాదరబోయిన లింగయ్య

Gadaraboina Lingaiah, General Secretary of Private Lecturers Associationనవతెలంగాణ – తిరుమలగిరి 
సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ కు రాష్ట్రస్థాయిలో  కార్పొరేషన్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రైవేట్  లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గాదరబోయిన లింగయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తుంగతుర్తి నియోజకవర్గం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన చెవిటి వెంకన్న యాదవ్ 30 సంవత్సరాల నుండి వార్డు మెంబర్ స్థాయి నుండి అంచలంచలుగా ఎదిగి రెండుసార్లు తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా పదవులు నిర్వహించి నేడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానంలో ఉండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ, జిల్లాలో ప్రజా సేవ చేస్తూ నిరంతరం ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి చేదోడువాదోడుగా ఉంటూ పార్టీ ఆదేశానుసారం ప్రతి కార్యక్రమాన్ని నడిపిస్తూ గత పది సంవత్సరాల నుండి టిఆర్ఎస్ ప్రభుత్వం నాయకులను కార్యకర్తలను ఒత్తిడి చేసినప్పటికీ ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి అండగా ఉండి నేడు జిల్లాలో మూడు స్థానాలను గెలుచుకోవడానికి కృషిచేసిన జిల్లా పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ కి రాష్ట్రస్థాయిలో ఒక మంచి కార్పొరేషన్ పదవి  ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని మరియు మంత్రి మండలి ని కోరారు.