
గ్రామపంచాయతీ కార్మికులు, ఆశా వర్కర్ల చలో హైదరాబాద్ కార్యక్రమాల సందర్భంగా సీఐటీయూ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం సరికాదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నాయక్ వాడి శ్రీనివాస్ అన్నారు. గ్రామపంచాయతీ కార్మికుల, ఆశ వర్కర్లకు కనీస వేతనాలు పెంచాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా కల్పించాలని కోరుతూ చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో నవీపేట్ పోలీసులు సీఐటీయూ నాయకులు నాయక్ వాడి శ్రీనివాస్, మేకల ఆంజనేయులను చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లకుండా నోటీసులు జారీ చేసి అడ్డుకోవడం సరికాదని అన్నారు. గత బి ఆర్ ఎస్ పాలకుల వలె కాంగ్రెస్ పాలకులు సైతం వ్యవహరిస్తే రానున్న ఎన్నికల్లో కార్మిక వర్గం తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.