చౌటుప్పల్ మండలంలోని ఖైతాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలో 1వ తరగతి నుంచి 4వ తరగతి చదివే విద్యార్థుల కోసం కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్ గారి సహకారంతో మంగళవారం విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు మహనీయుల చిత్రపటాలను అందజేశారు. అంగన్వాడీ కేంద్రాలోని పిల్లలకు ఆట వస్తువులు పంపిణీ చేసిన కస్తూరి ఫౌండేషన్ సభ్యులు బండిగారి శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ప్రతి ఒక్క నిరుపేద విద్యార్థికి అందాలనే లక్ష్యంతో కస్తూరి ఫౌండేషన్ తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తుంది అని అన్నారు. విద్యార్థులు శ్రద్దగా చదువుకొని రాబోయే రోజుల్లో మంచి స్థాయికి వెళ్లాలని,వారి తల్లిదండ్రులకు మరియు వారి ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకరావాలని కోరారు అదే మా కస్తూరి ఫౌండేషన్ లక్ష్యమని తెలిపారు .ఇలాగే ఇంకా మరెన్నో కార్యక్రమాలు కస్తూరిఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పిసాటి ఉపేందర్ రెడ్డి,తగరం వెంకటేష్,పిల్లి శ్రీనివాస్,ముద్దం పర్వతాలు,గడ్డం శంకరయ్య,అనిల్,శ్రీకాంత్,ప్రవీణ్,రాకేష్, బాబు,సన్ని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.