దుబ్బాక మండలం పెద్ద చీకోడ్ మాజీ సర్పంచ్ తౌడ శ్రీనివాస్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మంగళవారం కలిసి పరామర్శించారు. తల్లి మరణంతో కుంగిపోవద్దని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ధైర్యాన్ని ఇచ్చారు. పరామర్శలో ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బాణాల శ్రీనివాస్,తదితరులు ఉన్నారు.