కాంగ్రెస్ పార్టీ ఎస్సీ జిల్లా శాఖ ఉపాధ్యక్షుడిగా కోహెడ మండలంలోని సముద్రాల గ్రామానికి చెందిన చింత కింది శంకర్ ను నియామకం చేసినట్లు జిల్లా చైర్మన్ కొమ్ము విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ మంగళవారం నియామక పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూస్తామన్నారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దాస అంజయ్య, మార్క సత్తీష్, అర్బన్ మండల అధ్యక్షుడు బిక్షపతి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రూరల్ అధ్యక్షులు నరహరి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు వడ్ల కొండ రవీందర్, కొదాడి రమేష్, పుట్ల యేసేపు, రాజేష్, రాజు, నర్సింలు, కుంచెం రవి, నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.