నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మంగళవారం ఆర్టీసీ డ్రైవర్ల పై గల కేసుల పునర్ సమీక్ష నిర్వహించారు. సమీక్ష సమావేశం నిజామాబాద్ నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గల కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. బి.కోటేశ్వర రావు, డి.సి.పి (అడ్మిస్), టి. నారాయణ ఏ.సి.పి ట్రాఫిక్ మరియు ఆర్టీసీ అధికారులు కె.జానీరెడ్డి ఆర్ యం వో, డిప్యూటీ ఆర్ ఎం ఓ వి.శంకర్, డిప్యూటీ ఆర్యంలో సరస్వతి, బి. ఎస్. ఆనంద్ నిజామాబాద్ డిపో 1 & 2 మేనేజర్, పి.రవికుమార్ ఆర్మూర్ డిపో మేనేజర్, ఎం శ్రీనివాస్ బోధన్ డిపో మేనేజర్ లు హాజరైనారు, వీరితోపాటు ఆర్టీసీ కేసులు గల సంబంధిత పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు హాజరై, ఆర్టీసీ డ్రైవర్ల పై గల కేసులను సమీక్షించినారు. ముఖ్యంగా సి.పి స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు సూచించడం జరిగినది. ఆర్టీసీ డ్రైవర్ తప్పుంటేనే మాత్రము వారిపై కేసులు పెట్టాలి లేకపోతే ఎట్టి పరిస్థితిలో వారిపై కేసులు పెట్టరాదని సూచించారు.