
డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్,డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ల ను నియమించాలని కోరుతూ టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంగళవారం లేఖ రాశారు. ఈ సందర్బంగా హై కోర్ట్ లోని ఆయన ఛాంబర్ లో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్ ఖాజా అహ్మద్ ,జాయింట్ కన్వీనర్ మోమిన్ రోషన్ జమీర్ తో కలిసి న్యాయవాదులతో సమావేశం అయ్యారు .అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, 2023 (BNSS)లోని సెక్షన్ 20 ప్రకారం రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌ను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. సెక్షన్ 20లోని సబ్-సెక్షన్ (2) ప్రకారం, 15 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా ప్రాక్టీస్‌లో ఉన్న న్యాయవాది లేదా సెషన్స్ జడ్జిగా ఉన్నా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లేదా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌గా నియామకానికి అర్హులని తెలిపారు.15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు యాక్టివ్ ప్రాక్టీస్‌లో ఉన్న న్యాయవాది మంచి పరిజ్ఞానం అనుభవం కలిగి ఉంటారని అన్నారు . ఈ మేరకు అర్హులైన న్యాయవాదులను తెలంగాణ రాష్ట్రానికి ప్రాసిక్యూషన్ డైరెక్టర్,డిప్యూటీ డైరెక్టర్ గా నియమించాలని కోరారు.ఈ సమావేశంలో మొహమ్మద్ రహ్మత్ అలీ, బాసిత్ ఖాన్, మెహమూద్ ఉర్ రెహమాన్, అర్హాన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.