పచ్చని చెట్లు.. ప్రగతికి మెట్లు: ఎఫ్ఆర్ఓ కోట సత్తయ్య 

Green trees.. Stairway to progress: FRO Kota Sattaiahనవతెలంగాణ – తాడ్వాయి 
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు జీవకోటికి ప్రాణవాయువు అందించే వాటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని తాడ్వాయి టెరిటోరియల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కోట సత్తయ్య అన్నారు. మంగళవారం వన మహోత్సవంలో భాగంగా మండల కేంద్రంలోని కేజీబీవీ కళాశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఫారెస్ట్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎఫ్ ఆర్ ఓ కోట సత్తయ్య మాట్లాడుతూ తెలంగాణలో వనం ముహూర్చ కార్యక్రమాన్ని యజ్ఞంలో భావించి మొక్కలు నాటి సంరక్షిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, విద్యార్థి దశ నుండే ముక్కలు నాటి, నాటిన ప్రతి మొక్కను సంరక్షించడం అలవర్చుకోవాలన్నారు. మనిషి ఆరోగ్యంగా మంచి ఆక్సిజన్ స్వీకరించాలంటే ఎన్ని కోట్లు ఖర్చుపెట్టినా స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకోలేమన్నారు. కానీ ఒక చెట్టు ద్వారా ఎంతో స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకోవచ్చని మరియు పచ్చని చెట్ల వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాల్లో గట్లపైన వీలైన ప్రతి చోట మొక్కలు నాటి, నాటిన ప్రతి మొక్కను, సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సక్రు నాయక్, ఎఫ్ ఎస్ ఓ లు  లక్ష్మీనరసు, విద్యాసాగర్, ఎఫ్ బి ఓ లు కుడుముల బక్కయ్య, శ్రీకాంత్, తిరుపతి, తాడ్వాయి కేజీబీవీ ప్రిన్సిపల్ ఇంప పుష్పలత, బేస్ క్యాంప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.