బ్యాంకు అధికారుల తప్పిదాలు రైతులకు శాపాలు

Bank officials' mistakes are curses for farmers

– అర్హత ఉన్న రైతులకు అందని రుణమాఫీ
– వ్యవసాయ శాఖ కార్యాలయాలకు వస్తున్న రైతులు
నవతెలంగాణ – భైంసా
రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి రుణమాఫీ చేసినప్పటికీ, అధికారుల తప్పిదాల మూలంగా రైతులు రుణమాఫీ కి నోచుకోవడం లేదు. లక్ష రూపాయలు, లక్షన్నర రూపాయల, మాఫీ జరిగినప్పటికీ ఎక్కువ మొత్తంలో ఫిర్యాదులు బ్యాంకు ఖాతా పేరుకు, ఆధార్ కార్డు పేరుకు మిస్ మ్యాచ్ కావడం వల్ల రైతులకు రుణమాఫీ ఆగిపోయింది. ఈ పరిస్థితి ప్రతి గ్రామంలో పది నుంచి 50 మందికి ఉందంటే అధికారుల తప్పిదాల వల్లేనని తెలుస్తుంది. బైంసా మండలం తో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. రేషన్ కార్డులో పేరు లేకపోవడం, అకౌంట్ నేమ్ మిస్ మ్యాచ్ కావడం, మూలంగా కొంత మంది రైతులకు మాఫీ నిలిచిపోవడంతో, రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో రుణమాఫీ కానీ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇలా ఉంటే ప్రభుత్వం గ్రీవెన్స్ సెల్ ప్రారంభించిన కేవలం మాఫీ రాని రైతుల పేర్లు నమోదు చేసుకుంటున్నారు తప్ప, సత్వర చర్యలు ప్రారంభించడం లేదు. ఇలా నిర్మల్ జిల్లాలో వేల సంఖ్యలో గ్రీవెన్స్ సెల్ కు దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. ప్రభుత్వం సత్వరమే తప్పుగా నమోదైన వాటిని సరి చేస్తే అర్హులైన రైతాంగానికి సకాలంలో రుణమాఫీ అందనుంది. లేనిపక్షంలో రుణమాఫీ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ బ్యాంకు అధికారులు తప్పిదాల వల్ల, ఇతరాత్రా తప్పిదాల వల్ల రైతాంగానికి రుణమాఫీ నిలిచిపోనుంది. రుణమాఫీ అందని రైతులు న్యాయం చేయాలని వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు సత్వరమే స్పందించిసమస్య తీర్చాల్సిన అవసరం ఉంది.