
నిరంతరం ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజాసేవ చేస్తున్న ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పై విమర్శలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కుంటాల మండల బీజేపీ నాయకులు రమణారావు హెచ్చరించారు. ఎనిమిది నెలల కాలంలో ఎంతో అభివృద్ధి చేసిన ఘనత మా నాయకునిదన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడి సమస్యల పరిష్కారం పై నిరంతరం పాటుపడుతున్నారు అన్నారు. బాసర త్రిబుల్ ఐటీ ని పలుమార్లు తనిఖీ చేసి త్రిబుల్ ఐటీ లో జరుగుతున్న తీరును అసెంబ్లీలో ఎండగట్టిన నాయకుడు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. ఇకనైనా అధికార పార్టీ నాయకులు తీరు మార్చుకోవాలని, దమ్ముంటే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తేవాలి గాని, అర్థం, ప ర్తం లేని మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. విద్య, వైద్యం, రైతాంగ అభివృద్ధి తమ నాయకుని ధ్యే యమన్నారు.సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ శునకా ఆనందం పొందుతున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. బిజెపి ఎమ్మెల్యేలు ప్రభుత్వ తీరును ఎండగడుతున్న విషయాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్ష పార్టీలు అక్కసు వెళ్ళబోసుకుంటున్నాయన్నారు.