ఉప్లూర్ పాఠశాలలో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ 

Anti-Drugs Pledge at Uplur Schoolనవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని ఉప్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం భారత ప్రభుత్వ ఆదేశాలనుసారం విద్యార్థులతో మత్తు పదార్థాల వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే.రాజన్న తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల వినియోగం వలన జరిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల భవిష్యత్తు చిన్నభిన్నమవుతుందని,వాటికి దూరంగా ఉండి ఉజ్వలమైన భవిష్యత్తును కాపాడుకోవలసిందిగా ప్రధానోపాధ్యాయులు కే. రాజన్న విద్యార్థులకు సూచించారు. డ్రగ్స్ వినియోగం వల్ల సమాజంలో నేరాల సంఖ్య పెరిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.డ్రగ్స్ సేవించిన వ్యక్తి తనను తాను మరిచిపోయి తప్పుడు ఆలోచనలతో నేరాలకు పాల్వడమే కాకుండా, వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురై పాణాలు కోల్పోయే  పరిస్థితి ఉంటుందన్నారు.డ్రగ్స్ రహిత దేశంగా, రాష్ట్రంగా, జిల్లాగా మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.అనంతరం పాఠశాల విద్యార్థులు అందరితో  డ్రగ్ వ్యతిరేక ప్రతిజ్ఞను చేయించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిరిమల్లె దేవన్న, కిషన్ గౌడ్, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.