– మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు
నవతెలంగాణ – భైంసా
రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారణ పేరుతో అర్హులైన రైతులకు రుణమాఫీ ఆపితే ఊరుకునే ప్రసక్తే లేదని బిజెపి ఆధ్వర్యంలో రైతుల పక్షాన పోరాడుతామని బైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు అన్నారు. గత ప్రభుత్వం లక్ష లోపు రుణాలు 19 లక్షల మందికి పంపిణీ చేస్తే ఈ ప్రభుత్వం అంక్షల పేరుతో 11 లక్షల మందికి మాఫీ చేసి, ఎనిమిది లక్షల మందికి రైతులకు రుణమాఫీ వేయలేదన్నారు. వ్యవసాయ రుణాలను నిబంధనల పేరిట రైతులను కార్యాలయాల చుట్టూ తింపదం సరికాదన్నారు. నిబంధనలు ఎత్తివేసామని ఓవైపు అసెంబ్లీలో మంత్రి ప్రకటిస్తుంటే, ఇక్కడ రైతులకు,రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు కు మ్యాచ్ కాలేదంటూ రైతుల ఖాతాల్లో రుణామాఫీ జమ చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. రుణమాఫీ అందని రైతుల వద్దకు గ్రామ గ్రామాన బిజెపి కార్యకర్తలు వెళ్లి వారి సమస్యను అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.