
మోపాల్ మండల కేంద్రంలో ప్రగతిశీల రాష్ట్ర నాయకుడు బండి మద నరసయ్యను ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా వైద్యం నిరుద్యోగ సమస్యలపై పి డి ఎస్ యు పి వై ఎల్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు చలో అసెంబ్లీ ముట్టడికి కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఉద్దేశంతో ముందస్తు నోటీసులు ఇచ్చి అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని రేవంత్ రెడ్డి సర్కార్ కి ఇది సరైన పద్ధతి కాదని ఆయన విమర్శించారు.