
నవతెలంగాణ – పెద్ద కొడపగల్
మండలంలోని పోచారం తాండ ప్రజలకు గంజాయి అక్రమ రవాణాపైఅవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడ్తు మీ తండాలో అక్రమ గంజాయి రవాణా చేస్తున్నట్లు ఆయన దృష్టికి రావడంతో తాండ యువకులుచెడు మార్గంలో వెళ్లకుండా మంచి మార్గంలో నడవాలని అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.ఎవ్వరైనా తండాలో గంజాయి అమ్మిన కొన్న తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకొని కేసునమోదు చేస్తామని అన్నారు.అలాగే మీ తండాకు ఏ అధికారులు వచ్చినా వారి విధులకు ఆటంకాలు కల్పించి భయబ్రాంతులకు గురి చేస్తారని తమకు సమాచారం ఉందని ప్రభుత్వ అధికారుల విధులకు సహాయ సహకారాలుఅందించితోడ్పడలని అన్నారు.లేకుంటే చర్యలు తీసుకుంటే మాత్రం కఠిన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.గత వారం క్రితం గంజాయి విక్రయిస్తుండగా ఒకరిని పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందని మరో ఇద్దరుతాండయువకులు పరారీలో ఉన్నారని వారికి తాండ పెద్దలువారి తల్లిదండ్రులతో మాట్లాడి పోలీసులకుఅప్పగించాలని లేనియెడలవారికి ఎలా పట్టుకురావలో మాకు తెలుసు అనిఆయన అన్నారు.అంతేకాకుండా జిల్లాలోనే గంజాయి స్మగ్లింగ్ అనే పేరు మీ తండాకు చెడ్డ పేరు వచ్చిందని అన్నారు.కొందరి వల్ల పోచారం తాండ పేరును జిల్లాలోనే వినబడటం మంచి పద్ధతి కాదని ఆయన మాట్లాడుతూఅన్నారు.ఇప్పటికైన తాండ పెద్దలు యువకులను చెడు మార్గంలో వెళ్లకుండా అరికట్టేందుకు పోలీసు వారికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.ఒక వేళ గంజాయితో పాటు మత్తు పదార్థాలు అమ్మిన కొన్న వారి పై కేసులు నమోదు చేసి వారి ఆస్తులను జప్తు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మహేందర్, సిబ్బందిలు సాయి శివ,శ్రీనివాస్,అంజి,సంజీవ్ రెడ్డి ,మాజీ సర్పంచ్,తాండ పెద్దలు యువకులు పాల్గొన్నారు.