నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని మండల ప్రత్యేక అధికారి అవినాష్ మధ్యాహ్న భోజనం కార్మికులను ఆదేశించారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల స్పెషల్ అధికారి బుధవారం మండలంలోని మల్లారం గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్,ప్రాథమిక పాఠశాలల, అంగన్ వాడి కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల, అంగన్ వాడి టీచర్లు సమయపాలన పాటిస్తునారా.. లేదాని అరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన, భోజనాన్ని మెనూ ప్రకారం అందిస్తూ,నాణ్యమైన విద్యను అందించాలని ఆదేశించారు.పాఠశాలల్లో ఉన్న సమస్యలపై కలెక్టర్ దృష్టికి తీసుకపోతామన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చెలుకల రాజు,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.