కష్ణ వంశీ, మోక్ష లీడ్ రోల్స్‌లో నటించిన లవ్ ఎంటర్‌టైనర్ ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స్ బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మించారు. టాప్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యుషన్ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని ఈనెల 2నగ్రాండ్ గా విడుదల చేయనుంది. ఈ నేపధ్యంలో మూవీ యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో కష్ణ వంశీ మాట్లాడుతూ, ‘దిల్ రాజు చాలా సపోర్ట్ చేశారు. ఆయనకి మనస్పూర్తిగా కతజ్ఞతలు. ఇందులో నా పాత్ర పేరు సిద్దు. తను రామచంద్రుడు లాంటి వాడే. చాలా ఇంట్రోవర్ట్. చాలా మంచి ఎమోషనల్ కోర్ ఉన్న సినిమా ఇది. ఆకాష్ చాలా హానెస్ట్‌గా తీశారు’ అని అన్నారు. ‘ఇది ఈ జనరేషన్ కథ. చాలా హానెస్ట్ లవ్ స్టొరీ. అందరికీ కనెక్ట్ అవుతుంది’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు.