– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) చెప్పారు. బుధవారం అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో ఆమె చిట్‌చాట్ నిర్వ హించారు. సభలో ఎవరు ఏం మాట్లాడుతు న్నారు.. ఏం చేస్తున్నారు.. అనే దాన్ని ప్రజలు చూస్తున్నారన్నారు. తమ కుటుంబానికి ఉద్యమ చరిత్ర ఉందనీ, పోడు భూముల వ్యవహారంలో తన తండ్రి జైలు జీవితం గడిపారని గుర్తుచేశారు. ప్రశ్నించడం అడవి బిడ్డల రక్తంలోనే ఉంటుందని చెప్పారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓట్ల కోసమే పోడు పట్టాలను పంపిణీ చేసిందనీ, నేతలు ఫొటోల కోసం ఫోజులిచ్చారని విమర్శించారు. గతంలో సబితా ఇంద్రారెడ్డి మీద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అపార గౌరవం ఉండేదనీ, మారిన రాజకీయ సమీకరణాల వల్ల ఇవాళ సభలో చర్చ జరిగిందని చెప్పారు.