– ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువును ఈనెల 20వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 20 వరకు ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు అవకాశముందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలను పొందాలని సూచించారు. అనుబంధ గుర్తింపు ఉన్న జూనియర్ కాలేజీల్లోనే చేరాలని విద్యార్థులు, తల్లిదండ్రులను కోరారు. ఆ కాలేజీల జాబితాను aషaస్రbఱవ.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ లేదా ్స్త్రbఱవ.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్లో పొందుపర్చామని వివరించారు. గుర్తింపు లేని కాలేజీల్లో చేరొద్దని సూచించారు.