ఘనంగా ఉపాధ్యాయులకు సన్మానం

Great tribute to teachersనవతెలంగాణ – జుక్కల్

మండలంలోని కేమ్రాజ్ కల్లాలీ ఎంపీయూపీఎస్ పాఠశాలలో విధులు  నిర్వహిస్తున్న  పలువురు ఉపాద్యాయులకు రాష్ట్ర ప్రభూత్వం ఇటివలే పదోన్నోతులు, బదిలిలు చేసిన చేయడం జర్గింది . అందులో బాగంగా కేమ్రాజ్ కల్లాలీ ఎంపీయూపీఎస్ ఉపాద్యాయులు వెరె మండలాలలకు, ఇంకొంత మందికి జుక్కల్ మండంలం లోనే ఇతర పాఠశాలలకు బదిలి చేసారు. పదోన్నోతి పొందిన ఉపాద్యాయులు  కేమ్రాజ్ కల్లాలీ  హెచ్ఎం జిల్లా ఉత్తమ ఉపాద్యాయుడు జయంచంద్ మండలంలోని బస్వాపూర్  ఎంపిపీఎస్ కు, కే. సంజయ్  కూమార్  ఎస్జీటీ  బిచ్కుంద  మండలం గుండేనమ్లి కి, ఎస్.ఙ్ఞానేశ్వర్ ఎస్జీటీ  ఎంపీయూపీఎస్   మహమ్మదాబద్ కు , బి.శ్రీచంద్ ఎస్ఏ తిమ్మాపూర్  ఎంపీయూపీఎస్ కు పదోన్నతి పైన  వెళ్లారు. ఏ. ఆశోక్ టీపీ టూ శాంతాపూర్, జి.చందు  హెచ్ పీ టూ నాగల్ గావ్ కు బదిలిపైన వెళ్లడం జర్గింది.  ఈ సంధర్భంగా పాఠశాల విద్యా కమిటి ఆధ్వర్యంలో ఉపాద్యాయులందరికి,  గ్రామ పెద్దలతో  కలిసి  సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కొన్నెండ్లుగా పాఠశాల విద్యార్థుల విద్యాభివృద్దికి కృషి చేసిన హెచ్ఎం జయచంద్ తో పాటు ఉపాద్యాయులు సంతోష్, సంజీవ్,   శాలువాకప్పి పుష్ప గుచ్చాలు, ఙ్ఞాపికలు అందచేసారు. అనంతరం విద్యార్థులు, సహఉపాద్యాయులు, గ్రామస్తులు ఉపాద్యాయులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు శంకర్, రమేష్ రావ్ దేశాయి, గ్రామ పెద్గలు తదితరులు పాల్గోన్నారు.