నవతెలంగాణ – మద్నూర్
మాదిగల పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఎస్సీ వర్గీకరణ అంశంలో రాష్ట్రాలకు అధికారం ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రత్యేక చొరవ చూపించి మద్దతుగా నిలిచిన మాదిగల పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు.
తెలంగాణలోని యావత్ మాదిగ సమాజానికి మాదిగ ఉప కులాలకు అసెంబ్లీ వేదికగా శుభాకాంక్షలు తెలియజేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు.