అడ్లూరు 2వ, వార్డులోని వన మహోత్సవం కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి మొక్కలు నాటరు.
గురువారం కామారెడ్డి పరిధిలోని అడ్లూరు 2వ వార్డ్‌లో పరిసరాలను పరిశీలించి ఆమె మాట్లాడుతూ ప్రథమ లక్ష్యం పర్యావరణం పరిరక్షణ అని మన మన గ్రామాలలో చెరువు గట్ల పైన, కాల్వ గట్లపైన వీరివిగ మొక్కలు పెంచుదాం చెట్లను పరిక్షించుకుందాం అన్నారు. పర్యావరణాన్ని కాపాడుదాం అని గ్రీన్ కవర్ లక్ష్యంగా ఈ ఏడది ప్రతి ఇంటిని, ప్రతి ఊరును పచ్చదనంతో ఉండేలా కామారెడ్డి పట్టణ ప్రజలందరూ ఒక్కొక్కరు ఒక మొక్క నాటాలనీ, మనం నాటే ప్రతి మొక్క రేపటి తరాలను మనమిచ్చే విలువైన కానుక రాష్ట్రమంతట వన మహోత్సవంలో ప్రతి ఒక్కరు భాగస్వాములన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత,వార్డ్ కౌన్సిలర్ సుతారి రవి, అన్వర్ హైమద్, తాయాబ సుల్తానా సలీం, పాత శివ కృష్ణమూర్తి, పిడుగు మమతా సాయిబాబా, ఆకుల రూప రవి, గడ్డమీది రాణి మహేష్ తదితరులు పాల్గొన్నారు.