పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల పట్ల స్పందించాలి: ఎస్పీ

Respond to the victims who come to the police station: SP– కొత్త చట్టాలపై అవగాహన కల్పించాలి 

నవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్)
పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల పట్ల తక్షణమే స్పందిచాలని జిల్లా ఎస్పీ సిహెచ్. సింధు శర్మా ఐ.పి.ఎస్ అన్నారు. బుదవారం సాయత్రం బాన్సువాడ టౌన్ స్టేషన్ ను జిల్లా ఎస్.పి. శ్రీమతి సిహెచ్. సింధు శర్మా ఐపిఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన వివరాలను స్థానిక సీఐ లకు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందిస్తూ, భాదితులకు తగు న్యాయం జరిగేలా పనిచేయాలని ఆదేశించారు. దొంగతనాలు జరగకుండా పగలు రాత్రి పెట్రొలింగ్ నిర్వహించాలని, సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు, వ్యాపార సముదాయాల నిర్వహులకు అవగాహన పెంచాలన్నారు, సైబర్ నేరాల పట్ల ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ప్రచారం చేయాలని ఆదేశించారు. కొత్త చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ నివారణా చర్యలు చేపట్టాలని తెలిపారు. సైబర్ నేరాల బారిన పడకుండా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. వీరి వెంట బాన్సువాడ టౌన్ ఎస్ హెచ్ ఓ, కృష్ణ , రూరల్ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ సత్యనారాయణ ఎస్సైలు, ఏఎస్ఐ లు హెడ్ కానిస్టేబుల్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.