శిశువు జన్మించగానే గంటలోపు ముర్రుపాలు ఇవ్వాలని అది ఎంతో శ్రేష్టమైనవని అంగన్వాడి ఉపాధ్యాయురాలు కల్పన అన్నారు. గురువారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో అంగన్వాడీ ఆద్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు సందర్బంగా అవగహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పి.ఎచ్.సి డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఆరోగ్యవంతమైన శిశువు పెరుగుదలకు పుట్టగానే 1 గంట లోపు బుర్రుపాలెం ఇవ్వాలని, 2 సంత్సరాలు వరకు తల్లిపాలు ఇవ్వాలని, తల్లిపాలలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని వివరించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు వి.ఉమారాణి, వి.కల్పన,టి.పద్మ,జి.లలిత,ఆశావర్కర్లు జ్యోతి,అనూరాధ,లక్షిమి,మల్లీశ్వరి ,ఏ.ఎన్. ఎం కవిత డ్వాక్రా మహిళ సంఘం అధ్యక్షురాలు సంతోషి, తల్లులు పాల్గొన్నారు.