సిరిసిల్ల సీనియర్ న్యాయవాది సురభి సత్యనారాయణ రావుపై తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో అక్రమ కేసు బనాయించడాన్ని నిరసిస్తూ గురువారం వేములవాడ లో న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించారు. వేములవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు పోలీసులు అక్రమ కేసులు బనా యించడాన్ని తీవ్రంగా ఖండించారు. వెంటనే కేసు తొలగించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం, కార్యదర్శి రజనీ కాంత్ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు రేగుల దేవేందర్, గడ్డం సత్యనారాయణ రెడ్డి, దివాకర్, పురుషోత్తం తోపాటు పెద్ద ఎత్తున న్యాయవాదులు పాల్గొన్నారు.