ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్ 

The Collector inspected the EVM godownనవతెలంగాణ – నల్గొండ కలెక్టర్
ప్రతినెల నిర్వహించే సాధారణ తనిఖీలో భాగంగా జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరచిన గోదామును తనిఖీ చేశారు. ఈవీఎం గోదాము వద్ద భద్రతను, పరిసరాలను ఆయన పరిశీలించారు. అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మోతిలాల్, ఎన్నిక్షల విభాగం డిటి విజయ్, కృష్ణమూర్తి, తదితరులు ఉన్నారు.