తల్లిపాలు బిడ్డకు శ్రేష్టం: ఎంపీడీవో వేణుమాధవ్ 

Breast milk is best for baby: MPDO Venumadhavనవతెలంగాణ – పెద్దవంగర
తల్లిపాలు బిడ్డకు శ్రేష్టమని ఎంపీడీవో వేణుమాధవ్, ఏసీడీపీఓ ఇందిరమ్మ అన్నారు. తల్లిపాల వారోత్సవాలను గురువారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముర్రుపాల ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ..మాతృత్వపు మధురిమతో పాటూ శారీరక పరిపుష్టిని అందించే అద్భుత ఆహారం తల్లిపాలు. శిశు జననం నుంచి కనీసం ఆరు నెలల పాటు తప్పకుండా తల్లిపాలు తాగించడంతో బిడ్డ జీవితకాలం సరిపడా ఆరోగ్యం లభిస్తుందన్నారు. అయితే ఈ మధ్యకాలంలో వివిధ కారణాలతో తల్లులు తమ పిల్లలకు పాలు పట్టించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని తద్వారా చిన్నారుల ఎదుగుదల పై ప్రభావం చూపుతుందని తెలిపారు. అంగన్వాడి సేవలను సద్వినియోగ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఎక్స్ రోడ్డు హెచ్ఎం సత్యనారాయణ, ఉపాధ్యాయులు రంజిత్, రవికుమార్, ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత, శోభ పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ అశోక్, అంగన్వాడీ టీచర్లు  మంజుల, రేణుక గర్భిణీలు, బాలింతలు అంగన్వాడి ఆయా ఐలమ్మ తదితరులు పాల్గొన్నారు.