సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం మండల నూతన కమిటిని ఏకగ్రీవంగా నియామకం చేసినట్లుగా జిల్లా అధ్యక్షుడు పర్కాల సమ్మయ్య గౌడ్ శుక్రవారం తెలిపారు.అధ్యక్షుడుగా పల్లెర్ల లక్ష్మీనారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బుర్ర వెంకటస్వామి గౌడ్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా ఎన్నికైన కమిటీ మాట్లాడారు సంఘం బలోపేతానికి, గౌడ సమస్యలు పరిష్కరించడంలో తమ వంతుగా కృషి చేస్తామన్నారు.గీతా కార్మికులు వృత్తి రీత్యా తాటి చెట్టు ఎక్కుతూ, దిగుతుండగా ప్రమాదానికి గురైన వారికి ప్రభుత్వం నుండి వచ్చే నష్టపరిహారం అందించాలని,55 ఏళ్ళు దాటినా గీతా కార్మికులకు ప్రభుత్వం ఆసరా పింఛన్లు ఇవ్వాలని కోరారు.తమ ఎన్నికకు సహకరించిన రాష్ట్ర, జిల్లా కమిటి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.