మావోయిస్టులకు ఎవరు సహకరిoచొద్దని కొయ్యిర్ ఎస్ఐ వడ్లకొండ నరేష్ అన్నారు.మావోయిస్టుల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న తాడిచెర్ల-ఖమ్మంపల్లి మానేరు బ్రిడ్జీపై విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా రెండు జిల్లాల నుంచి వెళుతున్న ద్విచక్ర ఇతర వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు.డ్రైవింగ్, వాహనాల పత్రాలను పరిశీలించి, అనుమానితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.గ్రామాల్లో అసాంఘిక వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలన్నారు.ముఖ్యమంగా యువత మద్యం,గంజాయి అలవాటై జీవితం నాశనం చేసుకోవద్దని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మద్యం సేవించినట్లుగా తెలిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.