ఆగస్టు 5 నుండి ఆగస్టు 9 వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పరిశుభ్రత, పచ్చదనాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి స్వచ్ఛదానం -పచ్చదానం కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంచిర్యాల డిఆర్డిఏ పిడి జన్నారం మండల ఇన్చార్జి అధికారి కిషన్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో మండల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.. సందర్భంగా వారు మాట్లాడుతూ .. గ్రామాలు ప్రాంతాల శుభ్రత ప్రతిరోజు వ్యవస్థగా చేపట్టాలి. మొక్కలు విరివిగా నాటాలని సూచించారు. ఇంటి స్థాయిలో మరియు కమ్యూనిటీ స్థాయిలో మొక్కలు అధికంగా నాటే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమం అయిదవ తేదీ నుంచి 9వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో పట్టణాల్లో నిర్వహించాలని సూచించారు. ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలకు పచ్చదనం పరిశుభ్రత పై అవగాహన కలిగించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శశికళ, ఎంఈఓ విజయ్ కుమార్, మండల వ్యవసాయ శాఖ అధికారి సంగీత, ఏపీవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు.