బదిలీపై వెళ్లిన కార్యదర్శి అంజద్ అలికి ఘన సన్మానం 

Great honor to Secretary Anjad Ali who went on transfer– విధుల్లో చేరిన పంచాయతీ కార్యదర్శికి మధుకి స్వాగతం 
– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ 
నవతెలంగాణ – నెలకుదురు 
మండలంలోని శ్రీరామగిరి గ్రామంలో ఇటీవల బదిలీపై వెళ్లిన పంచాయతీ కార్యదర్శి ఎండి అంజద్ అలీ కి కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ ఆ గ్రామ మాజీ సర్పంచ్ జ్యోతి మాజీ ఉప సర్పంచ్ గోవర్ధన్ ఆ దూరి కలదర్ రాజ్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ సుభాషిని శాల తో ఘనంగా సత్కరించి స్వాగతించినట్లు తెలిపారు. శుక్రవారం గ్రామపంచాయతీ సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది ఐకెపి సిబ్బంది గ్రామ నాయకులతో కలిసి శాల తో ఘనంగా సత్కరించి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని గా పంచాయతీ కార్యదర్శులు నిర్వహించిన ఎండి అంజద్ అలీ గ్రామ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని అన్నారు. గ్రామ ప్రజలతో మమేకమై గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ధనవంతు కృషి చేశారని అన్నారు. ఇటీవల బదిలీపై వెళ్లినందుకు అతనికి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిశాలతో ఘనంగా సత్కరించమని అన్నారు. ఈ గ్రామానికి నూతనంగా వచ్చిన పంచాయతీ కార్యదర్శి సుంకర్ మధుకి స్వాగతం పలికి శాలతో ఘనంగా గ్రామస్తులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుభాష్ రేస్ వెంకన్న సోమయ్య పుల్లారెడ్డి రాజారాం కరోబార్ ఉప్పలయ్య గ్రామపంచాయతీ సిబ్బంది అంగన్వాడీ వర్కర్లు ఆశ వర్కర్లు ఐకెపి సిబ్బంది సి ఎ ఏఎన్ఎంలు గ్రామ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.