మందకృష్ణ మాదిగకు ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా కమిటీ కృతజ్ఞతలు

MMRPS Kamareddy District Committee is thankful to Mandakrishna Madiga– మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం
నవతెలంగాణ –  కామారెడ్డి
ఎస్సీ, వర్గీకరణ కోసం 30 సంవత్సరాల నుండి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి రాజంపేట మండల కేంద్రంలో శుక్రవారం మందకృష్ణ మాదిగ కు పాలాభిషేకం చేశారు.    మాదిగ నేతృత్వంలో అలుపెరుగని పోరాటం భాగంగా నిన్నటి రోజు సుప్రీంకోర్టు ద్వారా మాదిగల అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందనీ, ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగా కు కామారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సత్తిగారి లక్ష్మి అన్నారు. మాట ఇచ్చిన ప్రకారం ప్రధానమంత్రి మోడీ  సుప్రీంకోర్టు ద్వారా తొందరగా తీర్పు ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నారు.  నిన్నటి రోజు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి నేనున్నాను సుప్రీంకోర్టు ద్వారా వచ్చిన తీర్పుకు నేను అనుకూలంగా స్వాగతిస్తున్నానని నిండు సభలో చెప్పి నిన్నటి రోజు నుండి వర్గీకరణ చేస్తానని నిండు సభ సాక్షిగా చెప్పడం జరిగిందనీ, ఆయనకు  కామారెడ్డి ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ తరఫున  కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాఎన్ని  ఎమ్మార్పీఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్తిగారి లక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా, ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బట్ట వెంకట్ రాములు పాల్గొని మందకృష్ణ మాదిగ  వల్ల ఆరోగ్యశ్రీ,  వృద్ధుల, వితాంతులు పెన్షన్ పెంచడం జరిగిందన్నారు. ఆయనకి ఎంతో రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట మహిళా అధ్యక్షురాలు సుజాత, రామారెడ్డి మండల అధ్యక్షుడు రాజనర్సయ్య, రామారెడ్డి మండల మహిళా అధ్యక్షురాలు లావణ్య, సాయిలు,  రామారెడ్డి మండల అధ్యక్షుడు,  సాయిలు, సాయవ్వ, కిషన్ తదితరులు పాల్గొన్నారు.