యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: సీఐ వెంకట్  

Youth should stay away from drugs: CI Venkatనవతెలంగాణ – చండూరు  
యువత మత్తు పదార్థాలు వాడితే జీవితం అంధకారం అవుతుందని  చండూరు   సిఐ వెంకట్ తెలిపారు. శుక్రవారం స్థానిక డాన్ బోస్కో  కళాశాలలో  ఎస్పీ ఆదేశాల మేరకు  విద్యార్థి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల  ఉద్దేశించి మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. యువత మత్తు మందు  వాడడం వలన శరీరంలో తెలియని మార్పులు చోటు చేసుకుంటాయని , యువత బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని  కోరారు. మతు పదార్దాలకు దూరంగా ఉండాలని విద్యార్దులు తమ లక్ష్యం వైపు దృష్టిని సారించి మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బాలశౌరి రెడ్డి , అధ్యాపకులు  విద్యార్దినివిద్యార్ధులు పాల్గొన్నారు.