ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకై మందకృష్ణ మాదిగ అలుపెరుగని పోరాట ఫలితమే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంలో శుభ పరిణామమని జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ పేర్కొన్నారు మాజీ ఎంపీ ఆహ్వానం మేరకు శనివారం నాడు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మందకృష్ణ మాదిగ ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బీబీ పాటిల్ ఆయనకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు,ఎస్సీ వర్గీకరణకై అలుపెరుగని పోరాటం చేసిన శ్రీ మంద కృష్ణ మాదిగ కు అభినందనలు తెలియజేశారు….ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ ను స్థాపించి గత 30 ఏళ్లుగా నిర్విర్యమంగా అలుపెరగని పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ పోరాట పటిమను ఈ సందర్భంగా కొనియాడారు..ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం అని అణగారిన వర్గాల దశాబ్దాల పోరాటానికి న్యాయం జరిగింది అని అన్నారు.