నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని లింగాల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఊకె జగన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ములుగు జిల్లా జడ్పీ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి ఆదేశాల మేరకు బాధిత కుటుంబాన్ని శనివారం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దండగుల మల్లయ్య, మాజీ జెడ్పిటిసి రామ సహాయం శ్రీనివాస్ రెడ్డి, నాయకులతో కలిసి పరామర్శించి, ఓదార్చి, క్వింటా బియ్యం, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతుడు జగన్ కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఊకే జగన్ మృతి బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అన్నారు. మంచి నాయకుడు, ఆయన మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ పాయం నరసింహారావు, పెండకట్ల కృష్ణ, చెన్నూరి నర్సయ్య, చెన్నూరు వెంకన్న, ఎండి రషీద్, పెండకట్ల బాలరాజు, చెన్నూరి కన్నయ్య, అనిల్, వల్లెపు సారయ్య, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.