మద్నూర్ ఉమ్మడి మండలంలోని నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు షేకాపూర్ తుకారాం మాట్లాడుతూ.. 30 ఏళ్ల పోరాట ఫలితమే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం సంతోషాకరమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. మాదిగ ఉపకులాలకు సుప్రీంకోర్టు తీర్పు న్యాయ ఫలితమని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేయడం ముఖ్యమంత్రికి ఎమ్మార్పీఎస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఉత్సవ ర్యాలీలో ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.