సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయన పరిధిలోకి వచ్చే వివిధ శాఖల నూతన చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్ లతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన రాష్ట్ర విత్తనాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, మార్క్ఫెడ్ చైర్మన్ మారా గంగరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.