ఫ్రీ మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
2024 – 25 విద్యా సంవత్సరానికి జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్  పాఠశాలలో ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఫ్రీ మెడికల్ వేతనాల కోసం (ఫ్రెష్, రెన్యువల్) ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్ కులములు అభివృద్ధి అధికారి ఎం జైయపాల్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలో 100% ఫ్రీ మెట్రిక్ ఉపకార  వేతనాలకు ఆన్లైన్లో దరఖాస్తు నమోదు చేయుటకు మండల విద్యాధికారులు,  ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని , వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, సహాయ షెడ్యూల్ కులములు అభివృద్ధి అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారి విద్యార్థులు ఉపకార వేతనాలు నమోదు ప్రక్రియ జరిగేలా చర్యలు చేపట్టాలని కోరారు. విద్యార్థుల యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న 2023 – 24 ఫ్రీ మెట్రిక్ హార్డ్ కాపీలు జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి అధికారి కార్యాలయంలో త్వరగా సమర్పించాలని కోరారు. విద్యార్థులు ఉపకార వేతనాలు నమోదు ప్రక్రియ ఫ్రీ మెట్రిక్ కోసం వెబ్సైటు నందు దరఖాస్తు చేసుకోవాలి అన్నారు.