ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం..

Traveling in RTC bus is safe..– ఏ ఎస్ పి శేషాద్రిని రెడ్డి..
– మహిళ ప్రయాణికులకు బహుమతుల ప్రధానం..
నవతెలంగాణ – వేములవాడ 
ఆర్టిసి బస్సులో ప్రయాణం సురక్షితం.. మీ గమ్య స్థలాలకు సురక్షితంగా చేర్చడంలో ఆర్టిసి బస్సు డ్రైవర్లు ఎంతో అనుభవం గలవారు ఉంటారని వేములవాడ ఏ ఎస్ పి శేషాద్రిని రెడ్డి అన్నారు.  వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ లోని శనివారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండి సజ్జనార్ ఆదేశాల మేరకు డీలక్స్ బస్సులో ప్రయాణించే మహిళలకు గిఫ్ట్ స్కీం భాగంగా వేములవాడ ఏ ఎస్ పి శేషాద్రిని రెడ్డి  లక్కీ డ్రా ద్వారా ముగ్గురికి బహుమతులను ప్రధానం చేశారు. వేములవాడ పట్టణానికి చెందిన రేగూరి సుజాతకు మొదటి బహుమతి, రెండవ బహుమతి అఖిల హైదరాబాద్, మూడో బహుమతి రమ్య వేములవాడ వారికి విశాల షాపింగ్ మాల్ వారి సౌజన్యంతో వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏ ఎస్ పి మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు ప్రయాణికుల భద్రత, గమ్మయ స్థలం చేర్చడంలో ఆర్టీసీ ముందంజలో ఉంటుందని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సంస్థను రక్షించుకోవాలని తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి డీలక్స్ బస్సుల్లో లక్కీ డీప్ ద్వారా ప్రవేశపెట్టిన స్కీం చాలా బాగుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ బి శ్రీనివాస్, ట్రాఫిక్ సూపర్వైజర్ సత్యనారాయణ, పిఆర్వో శ్రీనివాస్ యాదవ్, సత్యనారాయణ, శ్రీనివాస్,  ఎస్ఎం మల్లేశం, డ్రైవర్లు, మహిళా కండక్టర్లు తదితరులు పాల్గొన్నారు.