నవతెలంగాణ – శంకరపట్నం
మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ను హైదరాబాద్ లో తన నివాసంలో శనివారం హుజరాబాద్ డివిజన్ తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు , శంకరపట్నం కు చెందిన మహమ్మద్ షఫీ యొద్దీన్ ఈటెలను కలిసి షాలువతో సన్మానించారు. ఇటివలే ఎంపిగా గెలుపొందినందుకు మర్యాదపూర్వకంగా ఈటలను కలిసి శుభాకాంక్షలు తెలిపినట్టు, ఆయన చెప్పారు. ఈకార్యక్రమంలో చాంద్, సర్థార్,షామోహిల్ తదితరులు పాల్గొన్నారు.