మండలంలోని కొయ్యూరు అటవిశాఖ రేంజర్ గా జి.రాజేశ్వర్రావు శనివారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది రేంజర్ కు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.ఇప్పటి వరకు విధులు నిర్వహించిన రేంజర్ కిరన్ కుమార్ ఆల్లపల్లికి బదలీ అయ్యారు. హుజురాబాద్ నుండి బదలీపై వచ్చిన రాజేశ్వర్ రావు కొయ్యూరు రేంజర్ గా బాధ్యతలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.